ఇంటర్ విలీనంపై ఏకపక్ష నిర్ణయం వద్దు : రాంచందర్ రావు
రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఇంటర్ విలీన ప్రతిపాదనపై లోతైన చర్చ జరగాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.
Bjp


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ఇంటర్ విలీన ప్రతిపాదనపై లోతైన చర్చ జరగాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.

ఆదివారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో ఏ మార్పు చేసినా ముందుగా నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి సంఘాలను కూడా భాగస్వాములను చేసి, వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరమన్నారు.

అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అలాంటి సంప్రదింపులు జరిపినట్టు తనకు అనిపించడం లేదని చెప్పారు. అకడమిక్ వర్గాల నుంచి సరైన మార్గదర్శకం తీసుకోకుండానే ముందుకు వెళుతోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఇంత కీలక అంశంలో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande