భద్రాచలంలో కార్డాన్ అండ్ సెర్చ్.. 81 వాహనాలు స్వాధీనం
ప్రజల భద్రత కోసం ఆదివారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ పీఎస్ పరిధిలోని ముదిరాజ్ బజార్ లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Police


భద్రాచలం, 22 నవంబర్ (హి.స.)

ప్రజల భద్రత కోసం ఆదివారం తెల్లవారుజామున భద్రాచలం టౌన్ పీఎస్ పరిధిలోని ముదిరాజ్ బజార్ లో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 128 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

తనిఖీల్లో సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను గుర్తించారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న మరో 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఆపరేషన్ లో భద్రాచలం సబ్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, టీజీఎస్పీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande