పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు స్వేచ్ఛగా పోటీ చేయొచ్చు: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.
pawan


హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులు, అధికారిక అభ్యర్థుల కేటాయింపులకు అతీతంగా జరుగుతాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా సీట్ల పంపకాలు ఉండవని వివరించారు. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను పార్టీ నాయకులు ఎవరూ అడ్డుకోవద్దని ఆదేశించారు. కార్యకర్తలకు రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. జనసైనికులు, వీరమహిళలకు నామినేషన్ల సమయంలో లేదా ఇతరత్రా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ హెల్ప్డెస్క్ పనితీరును పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షిస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande