
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)చెన్నైలో జరిగిన కావ్య మారన్, అనిరుధ్ వివాహ రిసెప్షన్ వేడుకకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సంతోషంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
కావ్య మారన్, అనిరుధ్ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన అతిథులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆహ్వానితుల సమక్షంలో రిసెప్షన్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ వేడుకలో కల్వకుంట్ల కవిత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నూతన దంపతులతో కలిసి ఆమె కొద్దిసేపు గడిపి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్