ఐటీఐ విద్యార్థులకూ ఐఐటీ పట్టభద్రులతో సమాన గౌరవం దక్కాలి: నారా లోకేశ్
సమాజంలో ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీల్లో చదువుకున్న పట్టభద్రులతో సమానమైన గౌరవం లభించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Lokesh


అమరావతి , 22 నవంబర్ (హి.స.)సమాజంలో ఐటీఐ విద్యార్థులకు కూడా ఐఐటీల్లో చదువుకున్న పట్టభద్రులతో సమానమైన గౌరవం లభించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన కార్మికుల పట్ల ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన వారికే గుర్తింపు ఇవ్వకుండా, వృత్తి విద్య ద్వారా నైపుణ్యాలు సంపాదించిన వారిని కూడా సమానంగా గౌరవించాలని సూచించారు.

ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత వైపు వేగంగా అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు.

జర్మనీ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో నైపుణ్యం కలిగిన కార్మికుల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. అక్కడ వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. అదే తరహా దృక్పథం మన దేశంలోనూ రావాలని ఆకాంక్షించారు.

ఐటీఐ విద్యపై ఉన్న చిన్నచూపు తొలగించి, నైపుణ్య ఆధారిత వృత్తులను ఎంచుకునే యువతలో ఆత్మవిశ్వాసం, గర్వభావం పెంపొందించాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande