మేడారంలో భక్తుల రద్దీ
తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది తరలివచ్చారు.
Medaram


ములుగు, 22 నవంబర్ (హి.స.)

తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేలాది మంది తరలివచ్చారు.

ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానం చేసి, తలనీలాలు ఇచ్చుకున్నారు. అనంతరం గద్దెల వద్దకు చేరి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొత్త బట్టలు, బెల్లం, కొబ్బరికాయలు, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుల్లో భాగంగా చిన్నారులకు పుట్టు వెంట్రుకలు తీయించారు.

ఆ తర్వాత మేడారం చుట్టుపక్కల ఉన్న మ్యూజియం, చిలకలగట్టు, సారలమ్మ గుడి తదితర ప్రాంతాలను చూసి సంతోషంగా గడిపారు. కొందరు మేకలు, కోళ్లను అమ్మవార్లకు నైవేద్యంగా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి వంట చేసుకుని భోజనం చేసి తిరిగి బయలుదేరారు. ఈ సందర్భంగా పూజారి కాక రజింత్ భక్తులకు సేవలు అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande