
మహబూబాబాద్, 22 నవంబర్ (హి.స.)
మరిపెడ మండలంలోని తండాల్లో సాగుతున్న గుడుంబా దందాపై పోలీసులు ఆదివారం కొరడా ఝుళిపించారు. గుర్రపు తండా, మంచా తండాల్లో ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా సారా తయారు చేసి అమ్ముతుండగా దొరికిపోయారు. వారు దాచి పెట్టిన 25 లీటర్ల గుడుంబాను పోలీసులు జప్తు చేశారు. తయారీ కోసం నిల్వ ఉంచిన దాదాపు 300 లీటర్ల బెల్లం పానకాన్ని నేలపాలు చేశారు.
ఆరోగ్యానికి హాని కలిగించే ఈ నాటు సారా వ్యాపారాన్ని అరికట్టేందుకు ఇకపై తరచూ తనిఖీలు చేస్తామని ఎస్ఐ వెంకన్న తెలిపారు. పట్టుబడిన ముగ్గురిపై కేసు పెట్టి విచారణ జరుపుతున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..