కాపుల ఆత్మీయ సమావేశంలో సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
కాపుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
కాపుల ఆత్మీయ సమావేశంలో సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు


అమరావతి , 22 నవంబర్ (హి.స.)

కాపుల ఆత్మీయ సమావేశంలో బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ మేయర్ అభ్యర్థిగా రేలంగి శ్రీదేవి ఎంపిక కావడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి మేయర్ టికెట్ వస్తుందని కొందరు ఆశలు పెట్టుకున్నారని, అయితే కాపు టైగర్ సోము వీర్రాజు ఉండగా టికెట్ ఎక్కడికి పోతుందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా 1998లో జరిగిన రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల నాటి ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. అప్పట్లో ఎంవీవీఎస్ మూర్తి రిగ్గింగ్కు ప్రయత్నించారని ఆరోపించారు. రిగ్గింగ్కు వచ్చిన వారిని తాము ధైర్యంగా అడ్డుకున్నామని గుర్తుచేసుకున్నారు. నాటి ఎన్నికల పరిణామాలను వివరిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు బీజేపీ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తేనని సోము వీర్రాజు పేర్కొన్నారు. అయితే ఎంవీవీఎస్ మూర్తిపై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. మూర్తిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande