రుషికొండ బీచ్లో విషాదం.. సముద్రంలో గల్లంతైన విద్యార్థి
విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు అలల ఉద్ధృతికి గల్లంతయ్యాడు. ఈ ఘటనతో మిగిలిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రుషికొండ బీచ్లో విషాదం.. సముద్రంలో గల్లంతైన విద్యార్థి


విశాఖపట్నం, 22 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు అలల ఉద్ధృతికి గల్లంతయ్యాడు. ఈ ఘటనతో మిగిలిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివరాల ప్రకారం.. నలుగురు విద్యార్థులు రుషికొండ బీచ్కు వెళ్లారు. సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే అనూహ్యంగా సముద్ర అలల ప్రభావంతో వారిలో ఒక విద్యార్థి గల్లంతైనట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పర్యాటక, రక్షణ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. టూరిజం బోట్లను వినియోగించడంతో పాటు హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నారు. విద్యార్థి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఈ ఘటనతో రుషికొండ బీచ్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పర్యాటకులు, సందర్శకులు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande