ఉమ్మడి ఆదిలాబాద్లోనే అత్యధిక చలి.. కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్త
తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందువరుసలో ఉంటోంది.
Dense fog


ఆదిలాబాద్, 22 నవంబర్ (హి.స.)తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందువరుసలో ఉంటోంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే పది ప్రాంతాలను పరిశీలిస్తే, వాటిలో ఐదారు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. ముఖ్యంగా అర్లి(టి), బేల, సిర్పూర్(యు), గిన్నెధరి ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ తీవ్రమైన చలి నమోదవుతోంది.

ఈ ప్రాంతాల్లోనే చలి ఎందుకు ఎక్కువగా ఉంటుందనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ పలు వివరాలు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులు, పరిసరాల స్వభావం, వాతావరణ మార్పులు చలి తీవ్రతపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో భూమి నుంచి వేడి వేగంగా బయటకు వెళ్లిపోవడం, ఆకాశం నిర్మలంగా ఉండటం వంటి పరిస్థితులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గడానికి దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు స్థానిక భౌగోళిక స్వరూపం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande