తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నారాయణవనం మండలం వేత్తలుతడుకు సమీపంలో బైక్ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
Accident


తిరుపతి, 22 నవంబర్ (హి.స.)తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. నారాయణవనం మండలం వేత్తలుతడుకు సమీపంలో బైక్ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుత్తూరు మండలానికి చెందిన మణి, శ్రీనివాసులు అయ్యప్ప మాల ధరించారు. స్వామి దీక్షలో ఉన్న వీరిద్దరూ బైక్పై ఇంటికి తిరిగి వెళ్తుండగా వేత్తలుతడుకు వద్ద ప్రమాదం జరిగింది. అదే సమయంలో వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande