రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యం : సందీప్ కుమార్
గాంధీభవన్ లో నేడు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

గాంధీభవన్ లో నేడు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బి.ఎం. సందీప్ కుమార్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులంతా ఐక్యంగా పనిచేయడం వల్లే 64 ఎమ్మెల్యే సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ గెలిచిందని చెప్పారు. అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని సందీప్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కరువును సమర్థంగా ఎదుర్కొంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల అవసరాలు తీరుస్తోందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande