సాధారణ ప్రసవాలపై అవగాహన పెంచాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
ప్రభుత్వ దవాఖానాల్లో గర్భిణీలకు సహజ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.
Mla


వనపర్తి, 22 నవంబర్ (హి.స.)

ప్రభుత్వ దవాఖానాల్లో గర్భిణీలకు సహజ ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం పాలిటెక్నిక్ కళాశాల నుంచి సాధారణ ప్రసవాలపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి మొదలైన ర్యాలీ పాత బస్టాండ్, ఇందిరా గాంధీ పార్క్, కొత్త బస్టాండ్ మీదుగా రాజీవ్ చౌరస్తా వరకు సాగింది.

ఈ సందర్భంగా మేఘా రెడ్డి మాట్లాడుతూ.. సహజ ప్రసవం వల్ల తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటారని చెప్పారు. ముందు ముందు వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ఎస్.ఎల్.ఎన్ రమేష్, కౌన్సిలర్లు పరుశురాం, ఎర్పుల రవి యాదవ్, నర్సింగ్ కళాశాల లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande