పార్లమెంట్ సమావేశాలపై విపక్షాల కసరత్తు.. నేడు ఫ్లోర్లీడర్ల కీలక భేటీ
పార్లమెంట్లో జరగనున్న సమావేశాలను దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాలపై విపక్షాల కసరత్తు.. నేడు ఫ్లోర్లీడర్ల కీలక భేటీ


ఢిల్లీ , 28 నవంబర్ (హి.స.)పార్లమెంట్లో జరగనున్న సమావేశాలను దృష్టిలో పెట్టుకుని విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం విపక్ష పార్టీల ఫ్లోర్లీడర్లు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ వేదికగా అనుసరించాల్సిన కార్యాచరణ, లేవనెత్తాల్సిన అంశాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి కాంగ్రెస్తో పాటు పలు విపక్ష పార్టీల ప్రతినిధులను ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యంగా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏయే అంశాలపై నిలదీయాలి? ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావించాలి? వివిధ అంశాలపై విపక్షాలన్నీ ఒకే వేదికపై ఎలా స్పందించాలి? అనే విషయాలపై నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పరస్పర సమన్వయం సాధించడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పలు అంశాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. విపక్ష నేతల చర్చల అనంతరం పార్లమెంట్ సమావేశాల్లో వారి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande