'అసమాన జనాభా పెరుగుదలను ఆపకపోతే హిందువులు మైనారిటీ అవుతారు
'అసమాన జనాభా పెరుగుదలను ఆపకపోతే హిందువులు మైనారిటీ అవుతారు
'అసమాన జనాభా పెరుగుదలను ఆపకపోతే హిందువులు మైనారిటీ అవుతారు


పనాజీ, నవంబర్ 27 (హి.స): జనాభా మార్పులు, వాటి దీర్ఘకాలిక ప్రభావాలపై రూపొందించిన కీలక డాక్యుమెంటరీ 'డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ' (Demography is Destiny) ఈ రోజు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ - IFFI)లో ప్రదర్శితమైంది. జనాభా అసమానంగా విస్తరిస్తూనే ఉంటే రాబోయే కాలంలో భారతదేశంలోని స్వదేశీ ప్రజలు మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని ఇది హెచ్చరించింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త, హిందూస్తాన్ సమాచార్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర సంఘ్వీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి కామాఖ్య నారాయణ్ సింగ్, అన్షుమన్ శేఖర్ దర్శకత్వం వహించారు. దీర్ఘకాలిక జనాభా పోకడలను, జాతీయ స్థిరత్వం, సాంస్కృతిక కొనసాగింపు, సమాజ భవిష్యత్తుపై వాటి ప్రభావాలను తీవ్రంగా పరిగణించాలనే సందేశాన్ని ఈ చిత్రం వీక్షకులకు అందిస్తుంది.

జనాభా మార్పులు ఒక దేశ భవిష్యత్తును సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కోణాల్లో ఎలా ప్రభావితం చేస్తాయో ఈ డాక్యుమెంటరీ విశ్లేషిస్తుంది.

చారిత్రక జనాభా గణన గణాంకాలతో ప్రారంభమై, 19వ శతాబ్దం చివరి నుంచి నేటి వరకు భారతదేశ జనాభా నిర్మాణంలో వచ్చిన మార్పులను ఇది గుర్తిస్తుంది. అదే సమయంలో దేశ విభజన వంటి ప్రధాన చారిత్రక ఘటనలపై ఈ మార్పుల ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది.

దేశ భవిష్యత్తును సరైన దిశలో తీర్చిదిద్దడానికి, రక్షించుకోవడానికి ప్రజా అవగాహన, సకాలంలో చర్యలు తీసుకోవడం అత్యవసరమనే స్పష్టమైన సందేశంతో డాక్యుమెంటరీ ముగుస్తుంది. తగిన జనాభా నియంత్రణ చర్యలు సకాలంలో చేపట్టకపోతే, 2050-60 నాటికి హిందూ సమాజ జనాభా 50 శాతం కంటే తక్కువకు పడిపోతుందని ఇది హెచ్చరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీ సహ దర్శకులలో కామాఖ్య నారాయణ్ సింగ్ గతంలో 'జస్టిస్ డిలేడ్ బట్ డెలివర్డ్' (2020), 'భోర్: డాన్' (2018), 'ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్' (2026) చిత్రాలతో గుర్తింపు పొందగా; అన్షుమన్ శేఖర్ 'ఎ ట్రిబ్యూట్ టు లేట్ శ్రీ మనోహర్ పారికర్' (2019) చిత్రానికి దర్శకత్వం వహించారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande