జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధాలు.. గుజరాత్లో వ్యక్తి అరెస్ట్
గుజరాత్లో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు కీలక చర్యలు చేపట్టారు.
Arrest


వడోదర , 27 నవంబర్ (హి.స.)గుజరాత్లో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వడోదరలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సహరుల్ ఇస్లాంను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఉగ్రవాద సంస్థతో అతడికి ఉన్న సంబంధాలపై సమాచారం అందడంతో ఏటీఎస్ అధికారులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతడిని పట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిందితుడి వద్ద నుంచి ఒక రైఫిల్తో పాటు 20కి పైగా తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు అతడికి ఎలా అందాయి? వాటిని ఏ ప్రయోజనం కోసం వినియోగించాలనుకున్నాడు? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

జైషే మహ్మద్ సంస్థతో అతడికి ఉన్న సంబంధాలు, ఇతర వ్యక్తులతో పరిచయాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande