నేపాల్ లో ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీ.. చెన్నైకి చెందిన పర్యాటకుడు మృతి
నేపాల్లోని ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొని కూలిపోయాయి.
Helicopter


ఢిల్లీ , 03 నవంబర్ (హి.స.)

నేపాల్లోని ఎవరెస్ట్ పర్వత ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొని కూలిపోయాయి. మంగళవారం ఉదయం సోలుఖుంబు జిల్లాలోని ఫెరిచే హెలిపోర్ట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెన్నైకి చెందిన భారతీయ పర్యాటకుడు మృతిచెందగా, మరో ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.

ఉదయం 8.11 గంటల సమయంలో ఫిష్టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతుండగా వాటి రోటర్ బ్లేడ్లు పరస్పరం తగిలాయి. దీంతో రెండు హెలికాప్టర్లు అదుపుతప్పి మంచుతో కప్పబడిన ప్రాంతంలో కూలిపోయాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడున్నవారు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన 47 ఏళ్ల వసంత్ కుమార్ బలరామరామడు ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఫిష్టెయిల్ ఎయిర్కు చెందిన హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. మరో ప్రయాణికుడు షైలేష్ కృష్ణ పటేల్తో పాటు రెండు హెలికాప్టర్ల పైలట్లు గాయపడగా, వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande