
ఢిల్లీ , 03 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న నిరసనలు, ర్యాలీల కారణంగా వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పలు వ్యాపార సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. నిరసన కార్యక్రమాల వల్ల తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని వ్యాపార ప్రతినిధులు పిటిషన్లో వివరించారు.
ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆందోళనలు, ర్యాలీల కారణంగా రహదారులపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. నిరసనల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న నిర్బంధ చర్యలు, పలు మెట్రో స్టేషన్ల మూసివేత కూడా తమ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వెల్లడించాయి. ముఖ్యంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడంతో రోజువారీ ఆదాయం పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్