నేడు భారీ లాభాలలో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలను నమోదు చేశాయి.
Stock market


ముంబై, 03 నవంబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలను నమోదు చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు, దేశీయ మదుపర్ల నుంచి వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు జోరుగా కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్లో 614.66 పాయింట్లు ఎగబాకి 76,301.63 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 149.80 పాయింట్లు పెరిగి 23,588.55 పాయింట్ల వద్ద కొనసాగింది.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లలో ర్యాలీ నెలకొంది. స్టాక్ మార్కెట్లలో ఈ జోష్ కారణంగా మదుపర్ల సంపద గణనీయంగా పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande