
న్యూ ఢిల్లీ , 07 నవంబర్ (హి.స.)
సుప్రీం కోర్టు శనివారం రెండు కీలక విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తిని (CJI) లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు మరియు పోస్టులు చేసినందుకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) కి చెందిన పలువురు నాయకులకు మరియు నిర్వాహకులకు అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ (Contempt of Court) నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు నిర్వహించడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
మరోవైపు, దేశ రాజధానిలో కాలుష్య పరిస్థితిపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వాహనాల రాకపోకలపై నియంత్రణలు విధించినంత మాత్రాన కాలుష్య సమస్య పూర్తిగా తీరదని, శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిబంధనలు పాటించకపోవడం వల్ల కోట్లాది మంది ప్రజలు ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని న్యాయస్థానం హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi