
ముంబై, 07 నవంబర్ (హి.స.)
ఛాతీలో ఇబ్బందిగా అనిపించడంతో పాటు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో గత మూడు రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత, ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ శనివారం డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో జరిగిన చికిత్సతో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకునే వరకు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని, శారీరక శ్రమకు దూరంగా ఉండాలని సూచించారు. ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..