టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహం.. భారత వలసదారుల దండయాత్ర అంటూ వివాదం
టెక్సాస్, 19 ఫిబ్రవరి (హి.స.)అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన అతిపెద్ద హనుమాన్ విగ్రహంపై వివాదం చెలరేగింది. సుగర్ ల్యాండ్‌లో ఉన్న 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంపై MAGA(Make America Great Again) మద్దతుదారుడు చేసిన కామెంట్స్ ప్రస
huge-hanuman-statue-in-texas-sparks-controversy-525638


టెక్సాస్, 19 ఫిబ్రవరి (హి.స.)అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన అతిపెద్ద హనుమాన్ విగ్రహంపై వివాదం చెలరేగింది. సుగర్ ల్యాండ్‌లో ఉన్న 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహంపై MAGA(Make America Great Again) మద్దతుదారుడు చేసిన కామెంట్స్ ప్రస్తుత వివాదానికి కారణం అయ్యాయి. ఈ విగ్రహం టెక్సాస్ రాష్ట్రంలో సుగర్ ల్యాండ్‌ల ఉన్న శ్రీ అష్టలక్ష్మీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 90 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 2024లో ప్రతిష్టించచారు. ఇది అమెరికాలో మూడవ అతిపెద్ద హనుమాన్ విగ్రహంగా భావించబడుతోంది. ఈ విగ్రహం నిర్మాణం ఎన్నారైల విరాళాలతో జరిగింది. స్థానిక హిందూ భక్తులకు ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది.

అయితే ఇటీవల ఫిబ్రవరి 18న కార్లోస్ టుర్సియోస్ అనే కన్జర్వేటివ్ పార్టీ ముఖ్య నినాదం అయిన MAGA మద్దతుదారుడు ఒకరు తన X ఖాతా వేదికగా ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. భారతీయ వలసదారుల దండయాత్రకు నిదర్శనంగా పేర్కొన్నాడు. ముఖ్యంగా H-1B వీసాల ద్వారా భారతీయులు టెక్సాస్‌లోకి అధికంగా వస్తున్నారని విమర్శించాడు. అంతేకాదు Stop the invasion వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఉపయోగించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీశాయి. కాగా అమెరికాలో హిందూ మతానికి చెందిన దేవతల విగ్రహాలు పెరిగిపోవడంతో స్థానికుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సుగర్ ల్యాండ్‌ వంటి భారీ విగ్రహాలు ఇప్పటికే రెండు ఉండగా.. ఇది మూడవ అతిపెద్ద విగ్రహం.

ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీలు, పలు హిందూ సంస్థలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. వారు ఇది ప్రైవేట్ ప్రాపర్టీపై చట్టబద్ధంగా నిర్మించిన మతపరమైన విగ్రహమని, దీనికి ఇమ్మిగ్రేషన్ రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కార్లోస్ టుర్సియోస్ వ్యాఖ్యలు పూర్తిగా విద్వేషపూరితం అని మండిపడుతున్నారు. టుర్సియోస్ గతంలో కూడా H-1B వీసాలు, భారతీయ వలసలపై తీవ్ర విమర్శలు చేసాడని సమాచారం. తాజా ఘటన అమెరికాలో మత స్వేచ్ఛ, వలస విధానాలు, మత సామరస్యం వంటి అంశాలను తెరపైకి తెచ్చాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఇమ్మిగ్రేషన్, రిలీజియన్ ఐడెంటిటీపై పెరుగుతున్న నిరసనలు ఈ వివాదం మరింత సామాజిక, రాజకీయ చర్చలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande