మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది : జెలెన్స్కీ
ఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) ఆదివారం BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఈ విస్తృత ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రష్య
zelensky-said-world-war-3-has-begun-526699


ఢిల్లీ, 23 ఫిబ్రవరి (హి.స.) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) ఆదివారం BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. ఈ విస్తృత ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలోకి ప్రవేశించిన వేళ ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధం కేవలం ఉక్రెయిన్ సరిహద్దుల గురించి మాత్రమే కాదు, గ్లోబల్ సెక్యూరిటీ గురించి. ఇప్పటికే పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టాడు” అని అన్నారు. రష్యా చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆయిల్ మార్కెట్లు, ఆహార సరఫరాను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా చైనా, ఇరాన్, నార్త్ కొరియా వంటి దేశాలు రష్యాకు సైనిక, ఆర్థిక మద్దతు అందిస్తున్నాయని ఆరోపించారు. వీరి సహకారం వల్ల యుద్ధం ప్రాంతీయ సమస్యగా కాకుండా అంతర్జాతీయ భద్రతా సంక్షోభంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా డిమాండ్ చేస్తున్న క్రిమియా, డాన్బాస్ ప్రాంతాలపై నియంత్రణను అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ రష్యాకు బలాన్ని చేకూర్చుకునే సమయం ఇస్తుంది, తద్వారా భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన దాడులకు దిగే అవకాశం ఉంది. పుతిన్ లక్ష్యం కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు. అతను తన పవర్ ను ప్రపంచంపై విస్తరించాలనుకుంటున్నాడు అని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో జెలెన్స్కీ.. తమకు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలకు మద్దతు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, దీర్ఘశ్రేణి మిస్సైల్స్, ఆర్థిక సహాయం వంటివి అత్యవసరమని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande