యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు..!
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసి
యూట్యూబ్ అన్వేష్


హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)

యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసిన ఆ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పదంగా మారడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ వ్యవహారంపై స్పందించిన పంజాగుట్ట పోలీస్ అధికారులు, అన్వేష్ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండడంతో దేశంలోకి ప్రవేశించిన వెంటనే అదుపులోకి తీసుకునేలా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ తన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసి.. తనకు రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇందులో ఆయన ప్రధాన అకౌంట్ను ఇంస్టాగ్రామ్ బ్లాక్ చేసినట్లు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande