
అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.)
అమరావతి, : వాయిదా అనంతరం తిరిగి మొదలైన ఏపీ శాసనమండలి కేవలం పది సెకన్లలోనే మరోసారి వాయిదా పడింది. ఈరోజు ఉదయం సభ మొదలైన వెంటనే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. అలాగే, తిరుమల లడ్డూ ప్రసాదంపై నిన్న జరిగిన లఘు చర్చలో తప్పుడు పత్రం ఇచ్చారంటూ ఛైర్మన్ ప్రకటన చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ