నో హెల్మెట్... నో ఎంట్రీ.. మానుకోట పోలీస్ బాస్ కఠిన ఆదేశాలు!
మహబూబాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) ద్విచక్ర వాహానాలపై జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే వారందరికీ హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మహబూబాబాద్ జిల్లా పోలీస్ బాస్ డాక్టర్ శబరిష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిని కలవడానికి వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు
Sp


మహబూబాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.) ద్విచక్ర వాహానాలపై జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే వారందరికీ హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మహబూబాబాద్ జిల్లా పోలీస్ బాస్ డాక్టర్ శబరిష్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిని కలవడానికి వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులు, బాధితులు కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో సహా ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా కార్యాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల భద్రతే ప్రధానమని, ట్రాఫిక్ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలనే సందేశం ఇవ్వడానికే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించడంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్న పోలీసులు, అదే క్రమంలో పోలీస్ కార్యాలయానికి వచ్చే వారికీ అదే నిబంధన వర్తింపజేస్తున్నారు. మా భద్రత కోసం పోలీస్ బాస్ వ్యవహరిస్తున్న తీరును జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande