
హైదరాబాద్, 25 ఫిబ్రవరి (హి.స.)
వివాహ బంధం ద్వారా ఒకటవుతున్న నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ వేడుకకు తనను ఆహ్వానించిన విజయ్ తల్లిదండ్రులకు ఆయన లేఖ రాశారు. విజయ్ - రష్మికల వివాహ వేడుక ఆహ్వానం అందుకోవడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు మోదీ. వారి జీవితంలో ఇది అందమైన, కొత్త అధ్యాయానికి నాంది అని, సప్తపది పవిత్ర సంప్రదాయంతో జీవితాంతం స్నేహితులుగా, దంపతులుగా అన్యోన్యంగా ఉండాలని ఆశీర్వదించారు. సినిమాల్లోనే కాకుండా.. నిజజీవితంలోనూ వారిద్దరూ ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని అందంగా నిర్మించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని, విజయ్ రష్మికల జీవితం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా.. రేపు (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లో విజయ్ రష్మిక పెళ్లివేడుక ఘనంగా జరుగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు