అంతర్మథనంలో సిరిసిల్ల కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్..
రాజన్న సిరిసిల్ల :, 25 ఫిబ్రవరి (హి.స.) సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ప్లాఫ్ కావడమేనని స్పష్టమవుతుంది. సిరిసిల్ల బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరడం దేవుడు ఎరుగు గాని,
Sircilla Congress


రాజన్న సిరిసిల్ల :, 25 ఫిబ్రవరి (హి.స.)

సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికి కారణం మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ప్లాఫ్ కావడమేనని స్పష్టమవుతుంది. సిరిసిల్ల బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరడం దేవుడు ఎరుగు గాని, కనీసం ఆశించిన స్థానాలు రాలేదని కుంగిపోతున్నట్లు వినపడుతోంది. ఎన్నికల తరువాత పార్టీలోని బడా లీడర్లు పత్తా లేకుండా పోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా పార్టీని వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని ఆ పార్టీ వర్గాలు బహిరంగ వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో అధిష్టానం ఆత్మపరిశీలన చేసే యోవచనలో ఉన్నట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్..

రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయింది. సిరిసిల్ల మున్సిపల్ పీఠం దక్కించుకోవడం సరికాదు కదా.. కనీసం ఊహించిన సీట్లను కూడా సాధించలేకపోయింది.

కాగా అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అత్యధిక సీట్లు సాధించి, మూడోసారి సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 39 వార్డుల్లో 22 స్థానాలు మాత్రమే గెలుపొందగా, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉండి 27 స్థానాలు దక్కించుకోవడం, తక్కువ ఓట్లతో కొన్ని స్థానాలను చేజార్చుకోవడం గమనార్హం. ఈ విజయం వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కఠోర శ్రమ దాగి ఉండగా, కాంగ్రెస్ నేతల వైఫల్యం కూడా దీనికి కారణమని చెప్పవచ్చు.

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి వర్గ విభేదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మూడు, నాలుగు గ్రూపులతో పార్టీ మొత్తం ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా తయారయింది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. మున్సిపల్ ఎన్నికల తరువాత ముఖ్య నేతలు పత్తా లేకుండా పోయారని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల్లో జరిగిన పరాభావాన్ని తట్టుకోలేక వారు ముఖం చాటేస్తున్నారని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ సిరిసిల్లాలో మాత్రం ప్రతిపక్ష రాజకీయ విశ్లేషకులు పాత్ర పోషిస్తుందని చర్చించుకుంటున్నారు.

ఇటీవల జరిగిన సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యయమైనట్లు కనిపిస్తోంది. గెలిచిన ఆరు సీట్ల కూడా ప్రత్యర్థిపై ఉన్న వ్యతిరేకత వల్లనే బయటపడ్డాయని స్పష్టమౌతుంది. దీనికి ముఖ్య కారణం పార్టీలో నాయకత్వ లోపం, ముఖ్యనేతల మధ్య సమన్వయ తత్వమేనని అధిష్టానం గుర్తించినట్లు తెలిసింది. దీనిపై ఆత్మ పరిశీలన చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పార్టీలోని కొన్ని పదవులపై కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande