
భద్రాద్రి కొత్తగూడెం, 25 ఫిబ్రవరి (హి.స.)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ
సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల వస్త్రాల విక్రయ కౌంటర్లో నాలుగు సార్లకు పైగా బయట వస్త్రాలు కనిపించడం, కాంట్రాక్టర్ను తొలగించి దేవస్థానమే వస్త్రాల విక్రయం చేపట్టింది. దేవస్థానం వస్త్రాల విక్రయ కౌంటర్ను స్వాధీనం చేసుకున్న తరువాత కూడా వస్త్రాల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇదే సమయంలో, హైదరాబాద్ కు చెందిన ఒక భక్తురాలు అమ్మవారికి సమర్పించిన విలువైన పట్టు చీర మాయమైన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలపై కొందరి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఉద్యోగిని బదిలీ చేసి, తర్వాత మళ్లీ యథాస్థానానికి తీసుకురావడం పై కూడా విచారణ కొనసాగుతోంది.
అలాగే ప్రచార శాఖలో కూడా గోల్మాల్ జరగడంతో ఒక ఉద్యోగి పై రెండు లక్షల రూపాయల పెనాల్టీ విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు