గత వైకాపా పాలనలో అయిదేళ్లలో 1,15000 రోడ్డు.ప్రమాదాలు 43 మంది.ప్రాణాలు కోల్పోయారు
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.) చిలకలూరిపేట గత వైకాపా ప్రభుత్వ పాలనలో అయిదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు సంభవించి 43వేల మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇంత ప్రాణనష్టం జరిగినా నాటి పాలకులు రహదారుల నిర్మాణానికి కేవలం రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుప
గత వైకాపా పాలనలో అయిదేళ్లలో 1,15000 రోడ్డు.ప్రమాదాలు 43 మంది.ప్రాణాలు కోల్పోయారు


అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.)

చిలకలూరిపేట గత వైకాపా ప్రభుత్వ పాలనలో అయిదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు సంభవించి 43వేల మంది ప్రాణాలు కోల్పోయారని.. ఇంత ప్రాణనష్టం జరిగినా నాటి పాలకులు రహదారుల నిర్మాణానికి కేవలం రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్అండ్బీ రోడ్ల దుస్థితి - ప్రజల కష్టాలు అనే అంశంపై ఆయన మాట్లాడారు. 2014-19లో తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలో 6534 కి.మీ. మేర కొత్త రహదారుల నిర్మాణానికి ఏఐఐబీతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా జగన్ రద్దు చేశారని, అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, అమరావతి రింగు రోడ్డు నిర్మాణంతో సహా రాష్ట్రంలో దెబ్బతిన్న 30వేల కి.మీ. రహదారుల దుస్థితికి గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande