ఐదేళ్లలో20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం కూటమి.ప్రభుత్వం
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.):ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20న
ఐదేళ్లలో20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం కూటమి.ప్రభుత్వం


అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.):ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20నెలల్లో 1.09లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు అందిస్తున్నాయా.? అంటూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు బుధవారం అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. క్లస్టర్ విధానంలో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే 760ప్రాజెక్టులు గుర్తించామని చెప్పారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించబోతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,587నిర్వహించామన్నారు. ఇందులో 11,373పరిశ్రమలు పాల్గొని 1.09లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య పోర్టర్ ప్రారంభిస్తామన్న మంత్రి... స్కిల్ సెన్సెస్ చేద్దామనుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే ఏఐ ద్వారా స్కిల్ అసెస్మెంట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో ఎలక్ట్రికల్, ప్లంబర్ వర్కర్స్ సహా ఇతరులు ఎవరికివారే యాప్లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. వారికి తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పిందన్నారు. అప్పటికే ఉన్న స్కిల్ కార్పొరేషన్ ఉద్యోగుల్ని వైసీపీ నేతలు ఇళ్లల్లో పనికి పెట్టుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇంటర్న్షిప్ ముఖ్యమని భావించిన తాము ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande