4,339 ఖాళీ స్థలాలు చీరాల బాపట్ల రావాలి పురపాలక సంఘాల పరిధిలో
చీరాల26 ఫిబ్రవరి (హి.స.)4,339 ఖాళీ స్థలాలు ..జిల్లాలోని , బాపట్ల, రేపల్లే పురపాలక సంఘాల పరిధిలో 4,339 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.3.32 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.90.85 లక్షలు మాత్రమే వసూలైంది. మిగిలిన మొత్తం వచ్చే నెల
4,339 ఖాళీ స్థలాలు చీరాల బాపట్ల రావాలి పురపాలక సంఘాల పరిధిలో


చీరాల26 ఫిబ్రవరి (హి.స.)4,339 ఖాళీ స్థలాలు ..జిల్లాలోని , బాపట్ల, రేపల్లే పురపాలక సంఘాల పరిధిలో 4,339 ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.3.32 కోట్లు పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.90.85 లక్షలు మాత్రమే వసూలైంది. మిగిలిన మొత్తం వచ్చే నెలాఖరులోపు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నిర్మాణ రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీఎల్టీని సగానికి తగ్గించనుంది. ఖాళీ స్థలంలో నిర్మాణానికి సంబంధించి అనుమతులు తీసుకున్న నాటి నుంచి దాన్ని పూర్తి చేసేలోపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న ఎస్ఆర్ విలువ ఆధారంగా స్థలం విలువపై మున్సిపాలిటీల్లో 0.1 శాతం వంతున వసూలు చేస్తున్నారు.

దీన్ని ఇప్పుడు సగానికి అంటే 0.50 శాతం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం పురపాలక సాప్ట్వేర్లో మార్పులు చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే ఖాళీ స్థలాలకు సంబంధించిన పన్నుల వసూళ్లు వేగవంతమయ్యే అవకాశం ఉందని మున్సిపల్ ఉద్యోగులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande