
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.),:ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 23 పతకాలు దక్కాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ కూరం రఘు తెలిపారు. రెండు బంగారు, 8 వెండి, మూడు కాంస్య పతకాలు, 10 మెడలియన్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డులు లభించాయని బుధవారం ఓ ప్రకటనలో వివరించారు. పతకాలు సాధించినవారిని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేశ్కుమార్ తాడేపల్లి కార్యాలయంలో అభినందించారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ