ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన పై అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉ
Asaduddin


హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ తరుణంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.

మోడీ ఇజ్రాయెల్ పర్యటనపై ఓవైసీ సీరియస్...

ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్ పై అమెరికా దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. మరోవైపు గాజా మారణ హోమానికి బెంజమిన్ నెతన్యాహు కారణం అంటూ ఫైర్ అయ్యారు. అతన్ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఓవైసీ. అలాంటి వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోడీ కౌగిలించుకోవడం ఏంటి అంటూ నిలదీశారు. ఇది పాలస్తీనాకు భారత్ అందించే చిరకాల మద్దతును దెబ్బతీయటమేనని విమర్శలు గుప్పించారు ఓవైసీ. దీంతో అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande