
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల కోటద్వార్ 'వీరు పిరికిపందలు.. ఏమీ చేయలేరు' అని మాట్లాడిన మాటలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramachander Rao) తీవ్రంగా మండిపడ్డారు. 'పిరికిపంద' అనే పదం నిజానికి కాంగ్రెస్ పార్టీకే సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని, దేశంలో మతతత్వాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. ఇతరులను విమర్శించే ముందు, గత కొన్నేళ్లుగా తమ పార్టీ పనితీరు ఎలా ఉందో కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారం ఉన్నప్పుడు దేశ భద్రతను కాపాడలేకపోయిన కాంగ్రెస్, ఇప్పుడు ఇతరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రామచందర్ రావు కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు