
వరంగల్, 26 ఫిబ్రవరి (హి.స.)
వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో స్థానికంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టులోని ప్రతి గదిని, మూలమూలలా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకు వచ్చిన లాయర్లు, కక్షిదారులు, ప్రజలు ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా చూదాలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కానట్టు సమాచారం
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..