క్రికెట్ ఆడుతూ.గాయపడ్డ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు
అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.): ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పలువురు చాలా ప్రొఫెషనల్గా ఆడుతూ ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు గాయాల పాలయ్యారు కూడా. బుధవారం క్రికెట్ ఆడిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు.. రనౌట్ నుంచి
క్రికెట్ ఆడుతూ.గాయపడ్డ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు


అమరావతి, 26 ఫిబ్రవరి (హి.స.): ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో పలువురు చాలా ప్రొఫెషనల్గా ఆడుతూ ప్రతిభ చాటుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సభ్యులు గాయాల పాలయ్యారు కూడా. బుధవారం క్రికెట్ ఆడిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు.. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులోకి వేగంగా పరుగెత్తే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోయారు. శరీర భారమంతా ఎడమ భుజంపై పడింది. కిందపడే సమయంలో అర చేతిని నేలకు ఆనించడంతో మణికట్టు వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఫిజియో వైద్యుడు పరీక్షించి, పట్టీ వేశారు. తర్వాత ఆయన మణిపాల్ ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.

భుజానికి నొప్పి ఉండటంతో పాటు చేతి బొటన వేలికి గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన గురువారం హైదరాబాద్ వెళ్లనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande