
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమిషనర్గా ఎం.హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి.దివ్యను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లనూ ప్రభుత్వం బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి కలెక్టర్గా అనురాగ్ జయంతిని నియమించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్