
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)జూబ్లీహిల్స్లోని మంగళగౌరి షాపింగ్ మాల్లో ఇవాళ (గురువారం) భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పుకొచ్చారు. బిల్డింగ్ లోపల రెన్యువేషన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ప్రమాద సమయంలో షాపులో సిబ్బంది ఎవరూ లేరని స్పష్టం చేశారు. రెన్యువేషన్ పనులు జరుగుతుండటంతో మెటీరియల్స్ వేరే ప్రాంతానికి తరలించారని తెలిపారు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..?, లేక వెల్డింగ్ పనుల జరిగిందా.. అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటన సమయంలో ఐదుగురు మాత్రమే షాపులో ఉన్నారని.. అంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు.
షాపులో మెటీరియల్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. వేసవి సమీపించింది కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. షాపుల్లో ఫైర్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాందాస్ ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్