మిస్టరీగా 38 మంది మావోయిస్టుల ఆచూకీ.. అగ్రనేతల లొంగుబాటుతో క్లారిటీ వచ్చేనా?
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి తెలంగాణ నుంచి ఇక మిగిలింది 11 మంది శాఖ మావోయిస్టులు మాత్రమేనని రాష్ట్ర పోలీస్ వెల్లడించింది. తాజాగా అగ్రనేతల లొంగుబాటుతో మిగిలినవారు ఎందరు? అనే అంశం ఆసక్తికరంగా మారింది. జనవరి 3వ తేదీన
Mavoists


హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)

మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి తెలంగాణ నుంచి ఇక మిగిలింది 11 మంది శాఖ మావోయిస్టులు మాత్రమేనని రాష్ట్ర పోలీస్ వెల్లడించింది. తాజాగా అగ్రనేతల లొంగుబాటుతో మిగిలినవారు ఎందరు? అనే అంశం ఆసక్తికరంగా మారింది. జనవరి 3వ తేదీన పీఎల్బీఏ-1 బెటాలియన్ కమాండర్ బర్సే దేవా సరెండర్ కార్యక్రమంలో మిగిలింది కేవలం 17 మంది మాత్రమేనని పోలీస్ శాఖ తెలిపింది. అంతకుముందు 55 మంది ఉన్నారని పేర్కొన్నది. తాజాగా 11 మంది మాత్రమే ఉన్నారని పోలీస్ శాఖ స్పష్టం చేయడంతో మిగతా 38మంది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క తెలంగాణ నుంచే ఇంత పెద్దసంఖ్యలో కేడర్ జాడ తెలియకపోవడం చర్చకు దారితీసింది. వారి వివరాలను పోలీసు నిఘా వ్యవస్థలు వెల్లడిస్తాయా? లేక ఉద్యమం నుంచి బయటకు వచ్చిన నేతలు వెల్లడిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

గతంలోనే ఉద్యమానికి దూరమయ్యారా..?

మరోవైపు మావోయిస్టు కేడర్ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అగ్రనేతలు పొలిట్ బ్యూరో సభ్యుడు, సీసీఎం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సీసీ మెంబర్ మల్లా రాజిరెడ్డి, స్టేట్ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు లొంగుబాటుతో వారి వివరాలు ఏమైనా తెలిస్తాయేమో అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల సరెండర్లో మిగితా మావోయిస్టులు ఉంటారనుకున్నా వారికి నిరాశే మిగిలింది. 38 మంది కేడర్ విషయంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం చేరలేదని తెలుస్తోంది. వీరు పార్టీలో కొనసాగుతున్నారా.. లేదా? అనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిఘా వర్గాల అంచనా ప్రకారం..అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అనుమానిస్తున్నారు. అవకాశం ఉందని

మిగిలింది ఈ 11 మందే..

మావోయిస్టు అగ్రనేత గణపతితో పాటు పసునూరి నరహరి, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడె రత్నాబాయి, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, బడిశ ఉంగా, మాడ్వి అడుమే, కాశపోగు భవాని, కుంజం ఇడ్మల్ 11 మంది పార్టీలో క్రియాశీలంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అగ్రనేతల లొంగుబాటుకు ముందు డిసెంబర్, జనవరి నెలలో మూడు సార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లొంగుబాటు సమావేశాలు జరిగాయి. నవంబర్ 22వ తేదీన 59 మంది, డిసెంబర్ 19న 54మంది మావోయిస్టులు తెలంగాణ నుంచి ఉన్నారని వెల్లడించారు. కానీ జనవరి 3వ తేదీన పీఎల్బీఏ-1 బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటు సమావేశంలో 17ລ້ మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఆ సమయంలో మావోయిస్ట్ పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు.

కుటుంబ సభ్యుల ఎదురుచూపు..

ఆచూకీ తెలియని మావోయిస్టులను గుర్తించి లొంగుబాటుకు చర్చలు జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఇంద్రారోడ్కు చెందిన బెజ్జారపు కిషన్ అలియాస్ ప్రతాప్ డీసీ మెంబర్గా ఉన్నారని, ఆయన ఆచూకీపై అతని సోదరుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పోలీసు కార్యాలయాలతోపాటు లొంగిపోయిన మావోయిస్టుల వద్దకు వెళ్లి ఆచూకీ కోసం ప్రయత్నించినా తెలిసిరాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40ఏళ్లుగా తన సోదరుడు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం చింతిర్యాలకు చెందిన డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాసరెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ గ్రామం నుంచి ముగ్గురు పార్టీలోకి వెళ్లగా ఇద్దరు లొంగిపోయి స్వగ్రామానికి చేరుకున్నారని, అయితే శ్రీనివాసరెడ్డి ఆచూకీ తెలియలేదని అంటున్నారు. అంతేకాదు పెద్దపల్లి జిల్లా నుంచి ఐదుగురు.. జగిత్యాల, జనగామ, సిద్దిపేట నుంచి ముగ్గురు.. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు.. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, నిర్మల్, నిజామాబాద్, హనుమకొండ జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఆచూకీ తెలియని మావోయిస్టులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande