
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)
మల్కాజిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాపసింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చదువుతున్నాడని స్థానికులు గుర్తించారు. దేవాలయానికి చేరుకున్న బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి పేరు జుబేర్గా తెలుస్తుంది. ఈ ఘటన పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మల్కాజిరి కమిషనరేట్, పోచారండివిజన్ ప్రతాపసింగారంలోని అయ్యప్ప దేవాలయం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చేస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రతాపసింగారం నివాసి బద్దం కుమార్ ఫిర్యాదు మేరకు వ్యక్తి పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గురువారం ప్రతాపసింగారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అయ్యప్ప దేవాలయం, పరిసర ప్రాంతాల్లో ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు