నిజామాబాద్ మార్కెట్యార్డులో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్ మార్కెట్యార్డులో పసుపు రైతుల ఆందోళనకు దిగారు.
Farmers


హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)నిజామాబాద్ మార్కెట్యార్డులో పసుపు రైతుల ఆందోళనకు దిగారు. ఈనామ్ సర్వర్కు చెందిన సాఫ్ట్వేర్ పనిచేయకపోవడంతో రెండు రోజులుగా స్లాట్లు బుక్ కావడం లేదు. దీంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ఈ క్రమంలో మార్కెట్యార్డు కార్యాలయం డోర్ అద్దాన్ని పగులగొట్టారు. అధికారులు సముదాయించడంతో రైతులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

ముందుగానే రైతుభరోసా?

నిజామాబాద్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉన్న దూరం తొలగిపోనుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం,

పచ్చదనం, తాగునీటి సరఫరా, స్కూల్ రిపేర్లు, అంగన్వాడీల్లో వసతులు, విద్యుత్ సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. వ్యక్తిగత వినతులైన పెన్షన్, రేషన్ కార్డు, ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభం కాకముందే యాసంగి రైతుభరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రజల్లోకి వెళ్లినప్పుడు సానుకూల స్పందన ఉంటుందని, లేనిపక్షంలో నిధుల కోసం ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

0 రోజుల యాక్షన్ ప్లాన్ కోసం నివేదికలు ఇవ్వాలని అన్ని శాఖల సెక్రెటరీలను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీటిని పరిశీలించి షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande