
విశాఖపట్నం 26 ఫిబ్రవరి (హి.స.) విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన భారీవర్షానికి బీఆర్టీఎస్ ప్రధాన రహదారిలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఎగిరిపోయాయి. సరిపల్లి సమీపంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి నిర్మించిన పెళ్లి సెట్టింగ్ కూలిపోయింది.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి అవెన్యూ స్పోర్ట్స్ అవేరా క్రికెట్ మైదానం వర్షానికి పూర్తిగా జలమయమైంది. దాంతో అక్కడ జరుగుతున్న జాతీయ దివ్యాంగుల వీల్చెయిర్ క్రికెట్ పోటీలను అర్ధాంతరంగా ముగించి అప్పటివరకు ఉన్న గణాంకాల ఆధారంగా విజేతలను ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ