
కోవూరు ,27 ఫిబ్రవరి (హి.స.)
బుచ్చిరెడ్డిపాలెం: కోవూరు మండలం గంగవరం గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త గొర్రెపాటి శ్రీనివాసులు రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3,74,585 ఆర్థిక సాయం మంజూరైంది. శుక్రవారం ఆ చెక్కును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా పాటూరు నీటి సంఘాల ఉపాధ్యక్షుడు శింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి మాట్లాడుతూ గంగవరం తెదేపా కార్యకర్త గొర్రపాటి శ్రీనివాసులు రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి తెలియజేయగానే.. ఆమె నేరుగా ఆయన ఇంటికి వచ్చి పరామర్శించారు. అనంతరం సీఎం సహాయ నిధి ద్వారా రూ.3,74,585 ఆర్థిక సహాయం మంజూరయ్యేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కార్యకర్తల సంక్షేమానికి తెదేపా చేస్తున్న కృషిని కొనియాడారు. ఎమ్మెల్యే వెంట గంగవరం తెదేపా అధ్యక్షులు తలారి ఏడుకొండలు తదితరులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ