విజయయావాడ లో గ్రామీణ గృహిణి అరుదైన గౌరవం
అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.), : భావ కవితలతో పాటు సామాజిక అంశాలపై కథలు రాస్తూ ప్రముఖ సాహితీ సంస్థల నుంచి పలుమార్లు పురస్కారాలు అందుకున్న ఓ గ్రామీణ గృహిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలోని శ్రీశ్రీ కళావేదిక ప్రకటించిన ‘మహిళా కీర్
విజయయావాడ లో గ్రామీణ గృహిణి అరుదైన గౌరవం


అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.), : భావ కవితలతో పాటు సామాజిక అంశాలపై కథలు రాస్తూ ప్రముఖ సాహితీ సంస్థల నుంచి పలుమార్లు పురస్కారాలు అందుకున్న ఓ గ్రామీణ గృహిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయవాడలోని శ్రీశ్రీ కళావేదిక ప్రకటించిన ‘మహిళా కీర్తిరత్న’ పురస్కారానికి ఎంపికయ్యారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పరుచూరి కృష్ణభార్గవి సాహిత్యరంగం లో చేస్తున్న కృషికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు సంబంధిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక శ్రీబాలకృష్ణస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణాచార్యులు సతీమణి కృష్ణభార్గవి 2020వ సంవత్సరంలో తన రచనా ప్రస్థానం ప్రారంభించి మహిళల్లో చైతన్యాన్ని నింపే కవితలు, స్ఫూర్తిదాయక కథలు ఇప్పటి వరకు 1500కు పైగా రాశారు. 2025లో వివిధ సాహిత్య వేదికలపై 15కు పైగా పురస్కారాలు అందుకున్నారు. విజయవాడలో మార్చి 3న సర్వోత్తమ గ్రంథాలయంలో మహిళా కీర్తిరత్న అవార్డు అందుకోనున్నట్లు పురస్కార గ్రహీత తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande