నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం లో రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు
నంద్యాల, 27 ఫిబ్రవరి (హి.స.): జిల్లా బేతంచర్ల మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన 17 మంది.. ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ హుస్సేనాపురం గ్రామానికి పూల పూతల కోస
నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం లో రోడ్డు ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు


నంద్యాల, 27 ఫిబ్రవరి (హి.స.): జిల్లా బేతంచర్ల మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన 17 మంది.. ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ హుస్సేనాపురం గ్రామానికి పూల పూతల కోసం ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో గురుమానకొండ- సీతారామపురం గ్రామాల మధ్యలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బేతంచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ మధు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande