
అమరావతి, 27 ఫిబ్రవరి (హి.స.)ఏపీ శాసనమండలిలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం మొదలైన వెంటనే నిన్న(గురువారం) జరిగిన సంఘటనపై ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ‘నిన్న లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ సందర్భంగా తప్పుడు పత్రం చూపించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలి’ ఛైర్మన్ అన్నారు. ఛైర్మన్ రూలింగ్పై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలుపగా.. మరింత మాట్లాడి తనను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారా అని ఛైర్మన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి.. ‘మాకు మీరంటే అపారమైన గౌరవం ఉంది’ అని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ