
ఆదోని 27 ఫిబ్రవరి (హి.స.)ఆస్పరి మండలం పుటకల్లమర్రి గ్రామ సమీపంలో శుక్రవారం ఓ బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 25 మంది కూలీలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుటకలమర్రి గ్రామానికి చెందిన సుమారు 40 మంది బొలెరో వాహనంలో నలకదొడ్డిలో మొక్కజొన్న పంట కూలి పనులకు బయలుదేరారు. మార్గంమధ్యలో ప్రమాదవశాత్తు వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని బాధితులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ