
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.)
టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ పాకిస్తాన్
కు డూ ఆర్ డై మ్యాచ్. గట్టిగా కష్టపడితే సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ చేతిలో శుక్రవారం న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు సెమీస్ ఛాన్సులు కాస్త పెరిగాయి. ఈ టోర్నమెంట్ భాగంగా ఇవాళ పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై ఆతిథ్య శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేయాలి పాకిస్తాన్. అదే జరిగితే సెమీస్ పాకిస్తాన్ వెళ్లే ఛాన్స్ లు ఉంటాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తే, శ్రీలంక పైన 65 నుంచి 70 పరుగుల తేడాతో విజయం సాధించాలని కథనాలు వస్తున్నాయి.
ఒకవేళ శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి, పాకిస్తాన్ ఛేజింగ్ చేస్తే, 13 ఓవర్లలో టార్గెట్ ఎంత ఉన్నప్పటికీ ఫినిష్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలా జరిగితేనే నెట్ రన్ రేట్ విషయంలో పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్ రేట్ సాధిస్తుంది. తద్వారా సెమీస్ కు పాకిస్తాన్ వెళ్లే ఛాన్స్ లు ఉంటాయి. అలా జరగకపోతే పాకిస్తాన్ ఇంటిదారి పట్టడం గ్యారెంటీ. అప్పుడు న్యూజిలాండ్ కు సెమీస్ ఛాన్స్ లు ఉంటాయి. మరి ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఎలా మ్యాచ్ ఆడుతుందో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..