శ్రీలంకపై కివీస్ విక్టరీ..పాక్ కూడా బ్యాగులు సర్దుకోవాల్సిందే!
హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.) టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో పాటు పాకిస్తాన్ ఇంటి దారి పట్టాల్సిందేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్
World Cup


హైదరాబాద్, 26 ఫిబ్రవరి (హి.స.)

టీ20 వరల్డ్ కప్ లో శ్రీలంకతో పాటు

పాకిస్తాన్ ఇంటి దారి పట్టాల్సిందేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం సాధించిన నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్ ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి. న్యూజిలాండ్ కంటే పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్నంతటికి కారణం శ్రీలంకపై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టడమే.

సెమీ ఫైనల్ లోకి పాకిస్తాన్ అడుగు పెట్టాలంటే ?

ప్రస్తుత పరిస్థితులలో టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో పాకిస్తాన్ అడుగు పెట్టాలంటే మిరాకిలే జరగాలని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే... ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ భారీ తేడాతో చిత్తుగా ఓడిపోవాలి. ఇక ఆ తర్వాత శ్రీలంక పైన పాకిస్తాన్ విజయం సాధించాలి. సాధారణ విజయం కాకుండా, భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలి. అలా చేస్తేనే పాకిస్తాన్ నెట్ రన్ రేట్ పెరుగుతుంది. ఇక ఒకవేళ ఇంగ్లాండ్ జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించినా లేదా ఆ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే పాకిస్తాన్ కు షాక్ తప్పదు. అప్పుడు న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. శ్రీలంక తో పాటు పాకిస్తాన్ కూడా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.

ఇలా పాకిస్తాన్ జట్టు ముందు పెద్ద సవాలే ఉంది.

వీటన్నిటిని దాటుకొని పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్తే మాత్రం ఆ కిక్కే వేరు. మరి ఇందులో ఎవరు సెమీ ఫైనల్ కు వెళ్తారో చూడాలి. గ్రూపు 2లో ఉన్న ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకుంది. వరుసగా పాకిస్తాన్, శ్రీ లంక పై విజయం సాధించి నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది ఇంగ్లాండ్. ఆతిథ్య శ్రీలంక కూడా ఎలిమినేట్ అయింది. వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిన శ్రీ లంక, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. ఇక అటు గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ప్రస్తుత లెక్కల ప్రకారం సెమీ ఫైనల్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇవాళ జింబాబ్వే పైన ఇండియా గెలిస్తే పరిస్థితి తారుమారవుతుంది.

ఈ టోర్నమెంట్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేస్తేనే ఇండియా సెమీ ఫైనల్ కు (semi Finals) వెళుతుంది. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిందే. ఇది ఇలా ఉండగా టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ మరో రెండు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో మొదట వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య మధ్యాహ్న 3 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫలితం ఇండియా పైన కూడా ఉంటుంది. వెస్టిండీస్ విజయం సాధిస్తే, ఇండియా సెమి ఫైనల్ ఛాన్స్ మరింత తగ్గనుంది. ఇక మరో మ్యాచ్ లో ఇండియా, జింబాబ్వే లాంటి చిన్న జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande